Pawan Kalyan: బాబాయ్ చెప్పే ఆ హారర్ స్టోరీసే వేరు.. పవన్ కళ్యాణ్ గురించి సుస్మిత ఇంట్రెస్టింగ్ రివీల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయన ఆలోచనలు, ఆయన నడిచే దారి ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. అయితే వెండితెరపై గంభీరంగా కనిపించే పవన్ కళ్యాణ్, ఇంట్లో పిల్లల మధ్య మాత్రం ఎంతో సరదాగా ఉండేవారట. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదని, తమకు బ్రదర్ అని పేర్కొన్నారు.
READ ALSO: Sushmita Konidela: బిగ్ బి తో ‘సైరా’ ప్రయాణం. అమితాబ్‌పై సుస్మిత ప్రశంసల వర్షం!
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
సినిమాలు, సంగీతం.. మా ‘గాడ్‌ఫాదర్’ ఆయనే..
అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే పవన్ కళ్యాణ్ అభిరుచులు చాలా భిన్నంగా ఉండేవని సుస్మిత తెలిపారు. “బాబాయ్ దగ్గర అద్భుతమైన సినిమా కలెక్షన్లు ఉండేవి. మాకు ‘గాడ్‌ఫాదర్’, ‘స్టార్ వార్స్’ వంటి అంతర్జాతీయ క్లాసిక్ సినిమాలను ఆయనే పరిచయం చేసేవారు. అలాగే ఇంగ్లీష్ మ్యూజిక్ వినిపించేవారు” అని చెప్పారు. ప్రపంచ సినిమాపై మాకు అవగాహన రావడానికి బాబాయ్ అభిరుచులే కారణమని ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్‌తో ఉన్న అత్యంత సరదా జ్ఞాపకం గురించి చెబుతూ.. “రాత్రి సమయాల్లో బాబాయ్ మా అందరినీ కూర్చోబెట్టుకుని హారర్ స్టోరీస్ చెప్పేవారు. నాకు హారర్ స్టోరీస్ అంటే ఇష్టం. మిగితా పిల్లలు వాటికి భయపడి పారిపోయే వారు” అని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ స్టైలింగ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఏం వేసుకున్నా అది ఒక ట్రెండ్ అవుతుందని, అది ఆయన వ్యక్తిత్వం నుంచే వస్తుందని అన్నారు. అయితే బాబాయ్‌లో ఉన్న మరో కోణం తమను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని ఆమె తెలిపారు. “ఆయనలో ఉన్న ఆధ్యాత్మికత, తాత్వికత పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన చిన్నతనం నుంచే మెటాఫిజిక్స్ వంటి క్లిష్టమైన విషయాలను చదివేవారు. అంత గంభీరమైన పుస్తకాలు చదవడం వల్లే ఆయన ఆలోచనలు ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
READ ALSO: Sushmita Konidela:’రంగస్థలం’ ఒక బెంచ్‌మార్క్.. చిట్టిబాబు మేకోవర్ వెనుక అసలు కథ ఇదే: సుస్మిత కొణిదెల
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!