NTV Telugu Site icon

Suryapet Junction: ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ ట్రైల‌ర్ విడుదల.. “మారని రాజకీయం, ఆగని రాక్షస క్రీడ”..

Suryapet Junction

Suryapet Junction

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన సినిమా ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించింది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

READ MORE: South India Shopping Mall: మహబూబ్‌నగర్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ 39వ షోరూమ్‌ ప్రారంభం

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ఈ సినిమాకు కథ తానే రాసినట్లు చెప్పారు. ఈ కథ సూర్యాపేట ప‌రిస‌రాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఉండనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉచిత పథకాలు తీసుకోవడం వల్ల మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో ఈ కథ తెలియజేస్తుందన్నారు. ఇది మంచి కథ అని.. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరించి, హిట్టు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయని చెప్పారు. నాలుగు పాటలు ప్రేక్షకును అలరిస్తాయన్నారు. ఇందులో యూత్‌కు బాగా న‌చ్చే స‌బ్జెక్టు ఉందని హీరోయిన్ నైనా తెలిపింది.

READ MORE: Vangalapudi Anitha: కూటమి ప్రభుత్వంలో 10 శాతం నేరాలు తగ్గాయి