Site icon NTV Telugu

Surya Kumar Yadav: బిగ్‌షాక్.. రేపు రిటైర్‌మెంట్ ప్రకటించనున్న సూర్యకుమార్ యాదవ్..!?

Suryakumar Yadav Statement

Suryakumar Yadav Statement

భారత క్రికెట్ అభిమానులకు ఒకవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఉత్సాహం ఉంటే.. మరోవైపు ఒక చేదు వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 8)న న్యూజిలాండ్‌తో జరగనున్న ఈ చారిత్రాత్మక పోరు తర్వాత.. టీమ్ ఇండియా ‘మిస్టర్ 360’ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం భారత టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్, ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండా తన కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గెలిచినా, ఓడినా ఇదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఆయన భావిస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read:Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..

ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్కై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  సూర్యకుమార్ యాదవ్ అంటేనే విధ్వంసకర బ్యాటింగ్ గుర్తొస్తుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌లో ఆయన గణాంకాలు చూస్తుంటే ఆ పదును కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు చేసినా.. ఆయన స్ట్రైక్ రేట్ 137.50 వద్దే ఆగిపోయింది. గతంలో 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడే సూర్య, ఇప్పుడు కాస్త నెమ్మదించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి కుర్రాళ్లు 180కి పైగా స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతుండటం కూడా స్కై ఆలోచనలో మార్పు తెచ్చి ఉండవచ్చని టాక్.

Also Read:IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?

35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్.. ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. టెస్టుల్లో ఒక్క మ్యాచ్, వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం (37 మ్యాచ్‌ల్లో 773 పరుగులు) ఆయన కెరీర్‌పై ప్రభావం చూపాయి. టీ20ల్లో 112 మ్యాచ్‌ల్లో 3272 పరుగులు సాధించి లెజెండరీ హోదా పొందినప్పటికీ.. భవిష్యత్తు టీమ్ బిల్డింగ్ దృష్ట్యా స్వచ్ఛందంగా తప్పుకోవడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అనేది రాలేదు.  ఒకవేళ ఇదే నిజమైతే.. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో ఒక ఎమోషనల్ ఎండింగ్ కానుంది. మరి ఈ స్టార్ ప్లేయర్ కప్పుతో తన ప్రయాణాన్ని ముగిస్తారో లేదో చూడాలి.

Exit mobile version