Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ 2026 గెలిపించినప్పటికీ భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత పేలవ ఫేమ్ కారణంగా జట్టులోనూ చోటు కోల్పోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడిన అతడు ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టును విజయవంతంగా నడిపిస్తూ తన కెప్టెన్సీ ప్రతిభను మరోసారి నిరూపించాడు.
ఈ టోర్నీలో ముంబై జట్టు మొత్తం 7మ్యాచ్‌లు ఆడింది. వర్షం కారణంగా విదర్భతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ సూర్యకుమార్ సారథ్యంలోని ముంబై విజయం సాధించింది. హైదరాబాద్, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్ జట్లపై గెలిచి సూపర్ లీగ్ దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో ముంబై మూడు మ్యాచ్‌లు ఆడనుంది. వాటి ఫలితాల ఆధారంగా ఫైనల్ అవకాశాలు నిర్ణయమవుతాయి.
కెప్టెన్‌గా మాత్రమే కాకుండా బ్యాటర్‌గానూ సూర్యకుమార్ ఆకట్టుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి, ఒకసారి నాటౌట్‌గా నిలిచి మొత్తం 214 పరుగులు చేశాడు. 53.5 సగటుతో, 230.10 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 కాగా, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. టోర్నీలో ఇప్పటివరకు 20 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నీలో 200కు పైగా పరుగులు చేసిన బ్యాటర్లలో సూర్యకుమార్ కంటే మెరుగైన స్ట్రైక్‌రేట్ ఎవరికీ లేదు. దీంతో అతడు తిరిగి మంచి ఫామ్‌లోకి వస్తున్నాడనే అర్థమవుతుంది. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటిలోనూ సత్తా చాటుతున్న స్కై.. ముంబైకి టైటిల్ అందిస్తాడో లేదో చూడాలి మరి.
Suryakumar Yadav pulled off a stunning diving catch in a Syed Mushtaq Ali Trophy match. 🤯🔥
– SURYA BHAU IS FLYING. 🔥🥶 https://t.co/6ImcxBD4zn
— lndian Sports Network (@IS_Netwrk29) November 26, 2026

