Suryakumar Yadav: రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వచ్చి చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. కెప్టెన్ సూర్య.. ఆన్ డ్యూటీ అంటూ.. కేవలం 37 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్సింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
READ ALSO: Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!
మ్యాచ్ తర్వాత BCCI షేర్ చేసిన వీడియోలో.. రాయ్‌పూర్ T20 హీరోలు ఇషాన్ కిషన్ – సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కనిపించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాను పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పుడు ఇంటి నుంచి వచ్చిన సలహాల ప్రభావం గురించి వివరించాడు. “చాలా సార్లు, మనం ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ కూడా ఒక కోచ్ ఉంటారు. మీరు పెళ్లి చేసుకున్న కోచ్. నా ఇంట్లో నా భార్య దేవిషా శెట్టి. నిజానికి ఆమె నన్ను చాలా దగ్గరగా చూసింది, కాబట్టి ఆమెకు నా మనసు తెలుసు. ఇటీవల ఆమె ఇచ్చిన సలహాల కారణంగానే చాలా కాలం తర్వాత నేను తిరిగి ఫామ్‌లోకి వచ్చాను” అని వెల్లడించాడు.
“నేను ఇటీవల ఆమె ఇచ్చిన సలహాను పాటించాను. నా భార్య నన్ను స్టార్టింగ్‌లో కొంచెం దూకుడు తగ్గించి స్లోగా, జాగ్రత్తగా ఆడాలని కోరింది. ఆమె కోరిన విధంగానే నేను నా ఇన్సింగ్స్ నిర్మించడానికి కొంత సమయం తీసుకుంటూ నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడుతున్నా. గత మ్యాచ్‌లో కూడా నేను అలాగే చేసాను. నేను నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నానని చెబుతున్నాను, కానీ మ్యాచ్‌లో పరుగులు సాధించే వరకు నమ్మకం రాదు. నాకు 2-3 రోజులు మంచి విశ్రాంతి లభించింది, ఇంటికి వెళ్లి సోషల్ మీడియాకు దూరంగా గడిపా. నా మైండ్ సెట్ చాలా బాగుంది. అలాగే గత మూడు వారాలుగా నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ రిజల్ట్ నా గేమ్‌లో కనిపిస్తుంది” అని వివరించాడు. నిజానికి సూర్య 468 రోజులు, 24 ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20లో మళ్లీ అర్ధ సెంచరీ సాధించాడు.
READ ALSO: T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్.. స్కాట్లాండ్ ఇన్..
