NTV Telugu Site icon

Suryakumar yadav: సూర్యకుమార్ అరుదైన రికార్డు..తొలి భారత క్రికెటర్‌గా!

41

41

సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. టీ20, వన్డేల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకుని ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు అరంగేట్రం కూడా చేసేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో సూర్యకుమార్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయాలన్న సూర్య కల నేరవేరింది. ఈ క్రమంలోనే ఇతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు.

Also Read: Jason Holder: జట్టు విజయం కోసం స్పిన్నర్‌గా మారిన పేసర్..చివరికి!

30 ఏళ్ల వయసు తర్వాత అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు. సూర్యకుమార్‌ 30 ఏళ్ల 181 రోజుల వయసులో టీ20ల్లో అరంగేట్రం చేయగా.. వన్డేల్లో 30 ఏళ్ల 307 రోజులు, టెస్టుల్లో 32 ఏళ్ల 148 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తొలి టెస్టుకు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో సూర్యకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది. మరోవైపు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ కూడా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

Also Read: Mrunal Thakur: దేవుడా.. సీత.. నువ్వు కూడా ఈ రేంజ్ లో చూపిస్తావనుకొలేదు

కష్టాల్లో ఆసీస్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాగ్‌పూర్ పిచ్‌పై పరుగులు సాధించేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ కష్టపడుతున్నారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 55 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. వార్నర్ (1), ఖవాజా (1) ఆదిలోనే ఔటవ్వగా.. లబుషేన్ (49), స్మిత్ (37) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మూడో వికెట్‌కు 82 రన్స్ జోడించిన అనంతరం లబుషేన్‌ను జడేజా పెవిలియన్ పంపాడు. అనంతరం ఇదే ఓవర్లో మ్యాట్ రెన్‌షా (0)లను ఔట్ చేసి మరోసారి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక కుదురుంటున్న స్మిత్‌ను జడ్డూ ఔట్ చేయగా.. కాస్త దూకుడు చూపించిన అలెక్స్ కారే (36)ను అశ్విన్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 162 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం ఆచితూచి ఆడుతోంది.