భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2022 జూలై 10న ఇంగ్లాండ్‌పై ఆడిన ఒక అద్భుతమైన, సుడిగాలి ఇన్నింగ్స్‌ను ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా గుర్తుచేసుకుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్‌కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (11), రిషభ్ పంత్ (1) కేవలం 31 పరుగులకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. అలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతను శ్రేయస్ అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌లో ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 23 బంతుల్లో 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 212.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 117 పరుగులు చేసి సంచలన శతకాన్ని నమోదు చేశాడు. సూర్య తన ఇన్నింగ్స్‌లో 19 సింగిల్స్, 3 డబుల్స్, 14 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
అయితే, ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ భారత్‌ను గెలిపించడానికి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి అవతలి వైపు నుండి ఇతర ఆటగాళ్లెవరూ సరైన మద్దతు ఇవ్వలేదు. దినేష్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7), హర్షల్ పటేల్ (5) వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. చివరకు మోయిన్ అలీ బౌలింగ్‌లో సూర్యకుమార్ అవుట్ కావడంతో భారత పోరాటం ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్య అసాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, భారత్ 17 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల ముందే సూర్య తన క్లాస్ చూపించిన ఈ ఇన్నింగ్స్‌ను “ప్రతి యాంగిల్ నుండి కడక్” అంటూ ముంబై ఇండియన్స్ కొనియాడింది. దీనిపై నెటిజన్లు సూర్య కుమార్ యాదవ్ ను మిస్ అవుతున్నామని.. వుయ్ మిస్ సూర్య భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

