NTV Telugu Site icon

Surya Tilak బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం.. లైవ్ వీక్షించిన ప్రధాని మోడీ

Modi

Modi

Surya Thilakam: శ్రీ రామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాల రాముడి నుదుటన సూర్య కిరణాలను తిలకంగా ప్రసరించాయి. నేటి మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఈ సూర్య కిరణాలు బాలక్‌ రాముడి నుదుటిని తాకాయ్. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం భక్తులను కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలను దేశ ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Read Also: Pemmasani Chandrashekar: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి..

ఇక, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ దృశ్యాలను తన ట్యాబ్‌లో చూశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా పోస్టు చేశారు. ఈ అద్భుత క్షణాన్ని చూసే ఛాన్స్ తనకి దొరికిందన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శ్రీరామ జన్మభూమి ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచే క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇక, అంతకు ముందు దేశ ప్రజలకు ప్రధాని మోడీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి కృప వల్లే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేయగలిగానని పేర్కొన్నారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన మదిలో మెదులుతునే ఉంటూ.. శక్తిని నింపుతున్నట్లు తెలిపారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే అవకాశం దొరింకిందన్నారు. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.