NTV Telugu Site icon

Surya Son of Krishnan: వాలెంటైన్స్ డే స్పెషల్.. మరోసారి తెరకెక్కనున్న “సూర్య సన్నాఫ్ కృష్ణన్”..

Surya Son Of Krishnan

Surya Son Of Krishnan

సూర్య ద్వి పాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. తమిళ్ లో “వారనమ్ అయిరమ్” పేరుతో తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన సినిమా.. తమిళ్ కంటే తెలుగులోనే హిట్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా ఫిబ్రవరి 14న ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెరకెక్కించనున్నారు.

READ MORE: Kerala: అంబులెన్స్ డ్రైవర్ దారుణం.. బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం..

ఈ సందర్భంగా తెలుగు అనువాద బ్యానర్ సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. ”సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటన చూపించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా ఈ మూవీ పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది.పివిఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఆ వీక్ లో తెలుగు నుంచి సూర్య సన్నాఫ్ కృష్ణన్ ను 12న ప్రదర్శించబోతున్నారు. ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపట్లోనే ఫుల్ అవుతోంది.13న మరో షో వేస్తున్నారు. అది కూడా ఫుల్ అవుతోంది. ప్రేక్షకులకు ఇది అంతటి ఇష్టమైన సినిమా ఇది.” అని తెలిపారు. ఇక 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లోనూ విడుదల కాబోతోందని వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం 300లకు పైగా షోలను ప్లాన్ చేసినట్లు తెలిపారు.

READ MORE:Mayank Agarwal: శరీరంపై కుర్తా, నుదిటిపై తిలకం.. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం( వీడియో)..