NTV Telugu Site icon

Oscars 2025 : ఆస్కార్‌ బరిలో సూర్య కంగువా

Kanguva

Kanguva

గతేడాది తమిళ్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కంగువ. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో వెనుకబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ప్లాప్ గా మిగిలింది. కానీ ఇప్పుడు అదే కంగువ ఇండియన్ సినిమా గర్వించే దిశగా దూసుకెళుతోంది.

Also Read : BA Raju : నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి. ఏ రాజు 65వ జయంతి

2024 తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ కంగువ ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది. 2025 వ ఆస్కార్ అవార్స్ కోసం మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుండి 207 సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి.  వాటిలో మన భారతదేశానికి చెందినా మూడు సినిమాలు ఆస్కార్స్ లిస్టు లో చోటు దక్కించుకున్నాయి. 97వ ఆస్కార్‌ బరిలో నిలిచిన కంగువా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఇండియా నుండి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా  ‘ఆడు జీవితం’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘సంతోష్ స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’  కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ  షార్ట్ లిస్ట్ లో స్థానం  సంపాదించ లేక వెనుతిరిగింది.

Show comments