సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. నేడు ‘సూర్యగ్రహణం’ సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం. ఈ గ్రహణం కన్య రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున వచ్చింది. హిందూ శాస్త్రాల ప్రకారం.. ఈ సూర్యగ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యకలాపాలు నిర్వహించరు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ప్రజలకు ఏవైనా అశుభ సంకేతాలను సూచిస్తుందో లేదో తెలుసుకుందాం.
సూతక కాలం చెల్లదు:
భారత సమయం ప్రకారం.. సూర్యగ్రహణం ఈరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం గరిష్ట సమయం తెల్లవారుజామున 1:11 గంటలకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో గ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. ఇండోనేషియా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. సూర్యగ్రహణం యొక్క సూతక కాలం భారతదేశంలో చెల్లదు. ఎందుకంటే.. ఈ గ్రహణం భారతదేశంలో రాత్రిపూట సంభవిస్తోంది కాబట్టి. సూతక కాలం చెల్లదు కాబట్టి ఈ రోజు ఎటువంటి మతపరమైన ఆచారాలు నిషేధించబడవు. ఈ రోజు సర్వ పితృ అమావాస్య.. రోహిణి ముహూర్తం సమయంలో పూర్వీకులకు నైవేద్యాలు పెట్టుకోవచ్చు.
Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్.. టీమిండియాకు హెచ్చరిక!
122 సంవత్సరాల తర్వాత:
జ్యోతిష్కుల ప్రకారం.. 122 సంవత్సరాల తర్వాత పితృ పక్షం (చంద్ర పక్షం)తో ప్రారంభమై గ్రహణంతో ముగుస్తుంది. ఈ యాదృచ్చికం చాలా అరుదు. 2025కి ముందు ఇలాంటి యాదృచ్చికం 1903లో జరిగింది. 1903 సంవత్సరంలో చాలా విషయాలు జరిగాయి. రాజు ఎడ్వర్డ్ VII, రాణి అలెగ్జాండ్రా పట్టాభిషేకం జరిగింది. బెంగాల్ విభజనకు ప్రణాళిక రూపొందించబడింది. అలానే భారత జాతీయ కాంగ్రెస్ మద్రాసులో సమావేశమైంది. ఈ ఏడాది కూడా బలంగా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.
సూర్యగ్రహణం రోజున పరిహారాలు:
సూర్యగ్రహణం సమయంలో మంత్రాలు జపించండి
సూర్యగ్రహణం సమయంలో దేవుని నామాన్ని జపించండి
సూర్యగ్రహణం సమయంలో కీర్తనలు పాడండి
త్రాగే నీటిలో తులసి ఆకులను వేయండి
