Site icon NTV Telugu

Surya Avinash Shashi: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Dead

Dead

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గద్దె శ్రీనివాసరావు కుమారుడు అయిన సూర్య అవినాష్ శశి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.. అనంతరం ఉన్నత చదువులకై అమెరికా లోని న్యూ జెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు… సోమవారం ఉదయం తన సన్నిహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళగా కాలుజారి పడి మృతి చెందినట్లుగా తెలియజేశారు…. చిట్యాల గ్రామంలో రెండు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు అమెరికాలో మృతి చెందడం పట్ల తీవ నిరాశలో ఉన్నారు.

 

అమెరికాలోని తానా అసోసియేషన్ వారి సహకారంతో మృతదేహాన్ని ఇండియా కు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తాన అధ్యక్షులు తెలియజేశారు…. గత రెండు నెలల క్రితం జరిగిన ఘటనలో కూడా స్పందించి మృతదేహాన్ని 35 లక్షల ఖర్చుతో తీసుకువచ్చేందుకు సహకరించిన తాన వారికి చిట్యాల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటనతో చిట్యాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

Exit mobile version