NTV Telugu Site icon

Amitabh Bachchan : ఒకే ఫ్రేమ్ లో సూర్య, అమితాబ్‌, అక్షయ్‌.. వైరల్ అవుతున్న పిక్..

Whatsapp Image 2024 01 15 At 1.26.26 Pm

Whatsapp Image 2024 01 15 At 1.26.26 Pm

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్‌ హీరోలు సూర్య, అక్షయ్ కుమార్ ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిని బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పిక్ చూసాక ఈ ముగ్గురూ ఒకే సినిమా లో నటిస్తున్నారా అనే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది..కానీ అసలు విషయం అయితే అది కాదు. అమితాబ్ బచ్చన్, సూర్య, అక్షయ్ కుమార్ లు ఒక ప్రకటన కోసం ఇలా మీట్ అయ్యారు . ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’ త్వరలో ప్రారంభం కానుంది. సెలబ్రిటీలు గేమ్ ఆడే జట్ల యాజమాన్యాన్ని తీసుకున్నారు. అందుకే, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సూర్య వంటి నటీనటులు ఈ లీగ్‌ ప్రకటనలో పాల్గొన్నారు. దీని ప్రకటన షూటింగ్ కోసం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా వచ్చారు. అయితే గ్రూప్ ఫోటో తీయకముందే హృతిక్ రోషన్ వేరే పని మీద బయటకు వెళ్లిపోయారు.

అక్షయ్ కుమార్, సూర్యతో కలిసి ఫొటో దిగిన అమితాబ్ బచ్చన్‌ దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ‘హృతిక్ రోషన్ త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసి వెళ్లిపోయారు.. మా షూటింగ్‌కి రెడీ అయ్యాను. సౌతిండియా నటుడు సూర్యను కలవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. గతంలో కూడా సూర్య సినిమాలను అమితాబ్ ప్రశంసించారు. అయితే అమితాబ్ బచ్చన్ చేతికి గాయమైంది. చేతికి కట్టు కట్టుకుని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌’ అడ్వర్టైజ్‌మెంట్‌ షూటింగ్‌ కోసం కూడా బ్యాండేజ్‌ వేసుకుని వచ్చారు.తన చేతికి ఏమయిందో అక్షయ్ కుమార్ కు ఆయన వివరించారు.ఆ సందర్భంగా తీసిన ఫొటోను తన బ్లాగ్‌లో షేర్‌ చేశారు.. 81 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ ఎంతో చురుగ్గా ఉంటున్నారు.. వరుసగా సినిమాలు, యాడ్స్‌లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

Show comments