NTV Telugu Site icon

Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kalvan

Kalvan

యంగ్ హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… హిట్ సినిమాలు పడుతున్నాయా లేదా పట్టించుకోకుండా ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. వాటిలో కాల్వన్ ఒకటి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓ మాదిరి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది..

ఇకపోతే మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాల్వన్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కాల్వన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కు జోడిగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కీలక పాత్ర పోషించాడు..

ఈ ఏడాది ఏప్రిల్ 4 న సినిమా థియేటర్లలో విడుదలైంది.. కథలో సరిగ్గా ఎమోషన్స్ లేకపోవడం, డ్రామాను పండించడంలో దర్శకుడు విఫలం కావడంలో ఫెయిల్యూర్‌గా నిలిచింది.. ఈ సినిమాకు పీవి శంకర్ దర్శకత్వం వహించాడు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం నిరాశ పరిచాయి.. కనీసం సరిగ్గా ఓపెనింగ్స్ కూడా అందుకోలేక పోయింది.. ఇక ఓటీటీలో ఏ మాత్రం టాక్ ను అందుకుంటుందో చూడాలి..