Suruchi Singh: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ ను సాధించిన సురుచీ సింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suruchi Singh: భారత యువ షూటర్ సురుచీ సింగ్ మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటింది. జర్మనీలోని మ్యూనిచ్ లో శుక్రవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఫైనల్లో ఆమె గెలిచిన గోల్డ్ మెడల్ ఆమెకు వరుసగా మూడవ ప్రపంచకప్ విజయం కావడం విశేషం. 19 ఏళ్ల సురుచీ, ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో 241.9 స్కోరు సాధించి ఫ్రాన్స్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కామిల్ జెడ్రెజెవ్స్కీ (241.7) పై కేవలం 0.2 పాయింట్ల తేడాతో గెలుపొందింది. చైనాకు చెందిన యావో క్యాన్షుయాన్ (221.7) బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ఈ విజయంతో భారత షూటింగ్లో ఆమె “లేటెస్ట్ గోల్డెన్ గర్ల్”గా నిలిచింది. సురుచీ ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచింది. విశేషంగా, బ్యూనస్ ఐరీస్ టోర్నమెంట్‌నే ఆమె మొదటి అంతర్జాతీయ అరంగేట్రంగా చేసుకుంది. ఈ ఫైనల్లో ఆమెకు ఎదురైన పోటీ తీవ్రమైనదే అయినా తన సహనంతో, నిబద్ధతతో విజయం సాధించింది. ఫైనల్లో ఆమె చేసిన షాట్లు ఆఖరి నిమిషాల్లో జోరు పెంచిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. చివరి రెండు షాట్లలో సురుచీ, కామిల్తో హోరాహోరీగా పోటీ చేసి తన చివరి బుల్లెట్‌తో గెలుపు ఖాయం చేసింది.
Read Also: Blaupunkt QLED Google TV: బ్లాపంక్ట్ కొత్త QLED టీవీ మోడల్స్ విడుదల.. ధర ఎంతంటే?
ఈ గోల్డ్ మెడల్ భారత షూటింగ్‌కు ఈ ప్రపంచకప్‌లో తొలి స్వర్ణంగా నిలిచింది. ఈ విజయంతో సురుచీ సింగ్ భవిష్యత్తులో భారత షూటింగ్‌కు అగ్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించగలదనే నమ్మకాన్ని ఇవ్వగలిగింది. ఫైనల్ తొలి సిరీస్‌లో 52.1 స్కోరు చేసిన సురుచీ మంచి ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ రెండో సిరీస్ తర్వాత ఆమె స్థానం దిగజారింది. 11వ షూట్లో వచ్చిన 9.7 స్కోరు ఆమెను నాలుగో స్థానానికి తీసుకెళ్లింది. అయితే వెంటనే 12వ షూట్లో ఆమె కొట్టిన అద్భుతమైన 10.8 స్కోరు ఆమెకు మళ్లీ ఆధిక్యం తెచ్చిపెట్టింది. 18వ షూట్ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన కామిల్ ముందంజలోకి వచ్చింది. చివరి రెండు షాట్స్‌కు ముందు సురుచీ 0.5 పాయింట్ల తేడాతో వెనుకబడినా, 23వ షూట్లో ఆమె చేసిన 10.5 స్కోరు విజయం దిశగా దోహదపడింది. చివరి షాట్లో ఇద్దరూ 9 స్కోర్లు సాధించినా, సురుచీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఈ ఫైనల్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో సురుచీ 588 పాయింట్లు సాధించి మను భాకర్ స్థాపించిన జాతీయ రికార్డును సమానం చేసింది. అయితే యావో 589 పాయింట్లతో జూనియర్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ టాప్ స్కోరర్‌గా నిలిచింది. మను భాకర్ 574 పాయింట్లతో 21వ స్థానం దక్కించుకోగా, పాలక్ 570 స్కోరుతో 30వ స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!