Site icon NTV Telugu

Chandragiri DSP: చంద్రగిరి డీఎస్పీపై వేటు.. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం..!

Dsp

Dsp

Chandragiri Dsp Sarath Rajkumar: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌ కుమార్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో డీఎస్పీ నిర్లక్ష్యం వహించినందుకే తగిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

Read Also: Uttarpradesh : హిందూ ఫ్రెండ్ ను కలిసినందుకు ముస్లిం విద్యార్థిని సస్పెండ్ చేసిన స్కూల్

అలాగే, నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం కావడంతో పాటు పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక, డీఎస్పీ రాజ్‌కుమార్‌ మూడు నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా నియామకం అయ్యారు. అలాగే, డీఎస్పీ రాజ్‌కుమార్ తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ను స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని తెలుస్తుంది.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో వేటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది.

Read Also: Krishana Chaitanya : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట వారితో తీద్దాం అనుకున్నా.. కానీ..?

కాగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ రోజున రాత్రి.. చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు చంద్రగిరి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సిట్ అధికారులు ఈసీకి ఇచ్చిన రిపోర్టులో వెల్లడించారు. అందుకే చంద్రగిరి డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. శరత్ రాజ్‌కుమార్‌ను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

Exit mobile version