Site icon NTV Telugu

Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా డిజిటల్ రైట్స్ ఫిక్స్!

Surya 46

Surya 46

స్టార్ హీరో సూర్య నేరుగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ‘Suriya46’ (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి నాగవంశీ రీసెంట్‌గా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో సూర్య 45 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తుండగా, ఆయనకు 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా ఇది ఉండబోతోంది. ‘గజిని’లోని సంజయ్ రామస్వామి తరహాలో సూర్య క్యారెక్టర్ ఎంతో రిచ్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని, వీరిద్దరి మధ్య ఉండే 25 ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల వచ్చే ఎమోషన్స్, ఫన్ ఈ సినిమాకు హైలైట్ అని ఆయన వెల్లడించారు.

Also Read : Lenin : సమ్మర్ బరిలో అక్కినేని హీరో.. ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ చిత్రంలో సూర్య సరసన యంగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండగా, జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. “మైదానంలో ఆయన ఛాంపియన్ కావచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఇంకా నేర్చుకునే విద్యార్థే” అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే, ఇందులో సూర్య క్యారెక్టర్‌లో స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీకి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సూర్య మార్క్ పెర్ఫార్మెన్స్, వెంకీ అట్లూరి క్లాస్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

 

Exit mobile version