Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!

Venky Atluri

Venky Atluri

అందరికీ నచ్చే సినిమా తీయడం కష్టమే అయినా, ఇష్టంతో తీసి హిట్ కొట్టడం ఎలాగో దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా తెలుసు. మొన్న ‘సార్’, నిన్న ‘లక్కీ భాస్కర్’, ఈరోజు ‘విశ్వనాథ్ & సన్స్’తో మరోసారి సూపర్ హిట్ మూవీ ఇచ్చేసాడు. తల్లి కొడుకు సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చినా, రాధిక-సూర్య మధ్య రిలేషన్ చాలా స్పెషల్. ఎందుకు? దర్శకుడు రాసుకున్న కొత్త పాయింట్‌ను ఆడియన్స్ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారా? ‘విశ్వనాథ్ & సన్స్’ ఫస్ట్ షోకే పాజిటివ్ మౌత్ టాక్ రావడానికి కారణాలు ఏంటి?
టీజర్, ట్రైలర్, సాంగ్స్ ‘విశ్వనాథ్ & సన్స్’కు హైప్ తీసుకొచ్చాయి. అందులోనూ ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస హిట్స్ తర్వాత వెంకీ డైరెక్షన్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ ఉండడం కామనే. ఆడియన్స్ నమ్మకాన్ని వెంకీ తనదైన సెన్సిబుల్ అండ్ స్టైలిష్ మేకింగ్ స్టైల్‌తో నిలబెట్టాడు. ఫీల్ గుడ్ మూవీతో మరోసారి ఆకట్టుకున్నాడు. వెంకీ అట్లూరి సక్సెస్ కథలోనే ఉంటుంది. సినిమా సినిమాకు కొత్త పాయింట్‌ను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు మెసేజ్ ఇవ్వడం డైరెక్టర్ స్టైల్. ‘సార్’లో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాలను ఎత్తి చూపాడు. ‘విశ్వనాథ్ & సన్స్’లో తల్లి కొడుకు సెంటిమెంట్‌ను డిఫరెంట్‌గా పండించాడు.
హీరో కంటే హీరోయిన్ 20 ఏళ్లు చిన్నది. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకొని కన్విన్సింగ్‌గా చెప్పి మెప్పించాడు. సున్నితమైన అంశాలను దర్శకుడు డీల్ చేసిన విధానం కన్విన్సింగ్‌గా ఉంది. ‘లక్కీ భాస్కర్’తో బెస్ట్ డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరి, మరోసారి ఆ స్థాయి మాటలు రాశాడు. లెంగ్తీ డైలాగ్స్ లేకుండా రాసుకున్న చిన్న చిన్న డైలాగ్స్‌తోనే బరువైన భావాన్ని పలికించాడు. దీనికి తగ్గట్టు జీవీ ప్రకాష్ మ్యూజిక్‌తో ఎమోషనల్ అయ్యేలా చేశాడు. మధ్య మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ ఫీల్‌ను డబుల్ చేశాయి.
మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఏది అంటే ‘విశ్వనాథ్ & సన్స్’కి వెళ్ళమని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేయొచ్చు. థియేటర్స్‌లో మంచి సెంటిమెంట్ మూవీ ఏది ఉందంటే ‘విశ్వనాథ్ & సన్స్’కి వెళ్ళమని ధైర్యంగా చెప్పొచ్చు. జెన్‌జీకి నచ్చే సినిమా ఏంటి అని అంటే అది కూడా ‘విశ్వనాథ్ & సన్సే’. జెన్‌జీ అనే కాకుండా క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమాగా ‘విశ్వనాథ్ & సన్స్’ తీసాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మార్నింగ్ షో పడడం ఆలస్యం పాజిటివ్ టాక్‌తో ‘విశ్వనాథ్ & సన్స్’ దూసుకుపోతుంది.
ఇక యాక్టింగ్ పరంగా సూర్య, మమితా బైజు, రాధిక మెయిన్ పిల్లర్స్‌గా నిలిచారు. పెర్ఫార్మెన్స్‌లో నువ్వా నేనా అని పోటీ పడ్డారు. ‘గజినీ’లో బిజినెస్‌మ్యాన్ సంజయ్ రామస్వామి రోల్‌తో మెప్పించిన సూర్యకు ఇందులో సంజయ్ విశ్వనాథ్ రోల్ పోషించడం చాలా ఈజీ అయిపోయింది. క్యారెక్టరైజేషన్‌కు ఎక్కువ తక్కువ కాకుండా మెచ్యూరిటీ చూపించాడు సూర్య. సంజయ్‌పై ఉన్న ప్రేమను, కెరీర్‌పై ఉన్న ప్యాషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ అల్లరి అమ్మాయి మ్యాడీగా మమితా బైజు తన క్యారెక్టర్‌నే కాదు, సినిమాను పండించేసింది.
ఇక రాధిక అయితే తన నటనతో అమ్మ పాత్రకు గౌరవం తీసుకొచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాధిక మాట్లాడుతూ తల్లి కొడుకు మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బాగా చెప్పాడని పేర్కొంది. ఏదైనా ఒక సినిమాలో ఒకటి రెండు సీన్స్ కన్నీరు పెట్టిస్తాయి. ఇందులో అలాంటివి ఆరేడు ఉన్నాయి. ప్రేక్షకులు తెలియకుండానే ఎమోషనల్ అయ్యేలా కథను నడిపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. అందరికీ నచ్చే సినిమానే సూపర్ హిట్ అవుతుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేసింది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, లవ్ ఇలా అన్నీ ఒకే కథలో కుదరడంతో ‘విశ్వనాథ్ & సన్స్’ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.