Site icon NTV Telugu

Suriya: సూర్య గొప్ప మనసుకు నెటిజన్స్ ఫిదా..

Suryaaa

Suryaaa

తమిళ స్టార్ హీరో సూర్య పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు.. అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం అని మరోసారి రుజువు చేశారు.. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు.. తాజాగా ఆయన గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..

సూర్య తన ఫ్యాన్స్ ను పిలిచి తానే స్వయంగా భోజనం వడ్డించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో తమిళనాడును వరదలు ముంచెత్తాయి. మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడులోని పలు నగరాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారి దీన స్థితిని గమనించిన సూర్య, కార్తీలు వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.. అంతేకాదు ఆ పరిస్థితుల నుంచి బయట పడేవరకు అందరికీ నిత్య అన్నదానం చేసి రియల్ హీరో అయ్యాడు..

అభిమానులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సూర్య ఫ్యాన్స్ ను మరోసారి పిలిపించి ఒక గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని అభిమానులందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు సూర్య. ఈ సందర్భంగా స్వయంగా సూర్యనే తన ఫ్యాన్స్ కు భోజనాలు వడ్డించడం విశేషం. అలాగే వారందరితో ఎంతో ఓపికగా ఫొటోలు దిగాడీ స్టార్ హీరో.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Exit mobile version