Site icon NTV Telugu

#Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్

#suriya46

#suriya46

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Suriya46. ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ బ్యూటీ మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, నిమిష్ రవి కెమెరా బాధ్యతలు, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

Also Read : Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!

ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు, అంటే మార్చి 2వ తేదీ సోమవారం ఉదయం 10:18 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ‘ఒక అద్భుతమైన దృశ్యకావ్యం సిద్ధమవుతోంది.. మీరు విస్మరించలేని ఉనికి ఇది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. వెంకీ అట్లూరి గతంలో ‘సార్’ (Vaathi) సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించగా, ఇప్పుడు సూర్యతో కలిసి ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి రేపు అప్ డేట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Exit mobile version