Suresh Raina Sixes: సిక్సర్లతో విరుచుకుపడ్డ సురేశ్ రైనా.. ఏం బ్యాటింగ్ సామీ అది! (వీడియో)
- రైంస్ సిక్సుల వర్షం
- 28 బంతుల్లో 53 పరుగులు
- ఉపుల్ తరంగ సూపర్ ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు. అమెరికా వేదికగా నేషనల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న సిక్స్టీ స్ట్రైక్స్ టోర్నమెంట్లో రైనా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ తరఫున ఆడుతున్న మిస్టర్ ఐపీఎల్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
37 ఏళ్ల సురేశ్ రైనా తన ఇన్నింగ్స్‌లో ఆరు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా షకిబ్ అల్ హసన్ ఓవర్లో భారీ సిక్సర్లతో చెలరేగాడు. రైనా ధాటికి షకిబ్ ఒకే ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు షకిబ్ మరలా బౌలింగ్‌కు రాలేదు. రైనా బాదిన బౌండరీలు కూడా అద్భుతంగా ఉన్నాయి. రైనా ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఓ బ్యాటింగ్ సామీ అది’, ‘రైనా భాయ్.. గ్రేట్ షాట్స్’, ‘ముందే ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చావ్ రైనా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
- Jio Prime Membership: జియో ప్రైమ్‌పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
- Bangladesh: భారత్‌తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
Also Read: Team India: డబుల్ ధమాకా.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం: దినేశ్ కార్తిక్
ఈ మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సురేశ్ రైనాతో పాటు ఉపుల్ తరంగ (40; 23 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగాడు. లాస్ ఏంజిల్స్ వేవ్స్ బౌలర్ టైమల్ మిల్స్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. ఆడమ్ రోసింగ్టన్ (31; 15 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. న్యూయార్క్ బౌలర్ శౌర్య గౌర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్‌పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!