NTV Telugu Site icon

Rishab Pant : రిషబ్ పంత్ ఇంటికి మాజీ క్రికెటర్లు

Raina

Raina

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు డివైడర్ ను ఢీ కొట్టి, కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి.. వీపు భాగాలు, మోచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నెలన్నర రోజుల పాటు ఆస్పత్రిలో చికత్స పొందిన పంత్ ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. చల్లని గాలిని , సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నానని ట్వీట్లు చేస్తున్న రిషబ్ పంత్, త్వరలోనే క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వగలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read : Marijuana intoxication: గంజాయి మత్తులో యువతి హల్చల్.. ఆటో డ్రైవర్లపై దాడి

తాజాగా భారత మాజీ క్రికెటర్లు హర్జజన్ సింగ్, సురేశ్ రైనా, శ్రీశాంత్ కలిసి రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. రిషబ్ పంత్ తో కలిసి దిగిన ఫోటోలను సోసల్ మీడియాలో సురేశ్ రైనా పోస్ట్ చేశాడు. అన్నదమ్ముల అనుబంధమే జీవితం.. మన మనసులో కుటుంబం చివరస్థాయిలో నిలిచిపోతుంది. నా తమ్ముడు రిషబ్ పంత్ త్వరగా మెరుగ్గా కోలుకోవాలని కోరుకుంటున్నా.. నన్ను నమ్ము తమ్ముడు.. నీకు ఏ సాయం కావాలన్న మేం సిద్ధంగా ఉన్నాం.. నువ్వు ఓ ఫోనిక్స్ పక్షిలా ఎగురుతావ్.. అంటూ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి ఫ్యామిలీ.. లైఫ్, బ్రదర్ హుడ్, టైమ్ అంటూ ట్యాగ్ లను జోడించాడు.. సురేశ్ రైనా.

Also Read : SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’ దగ్గరే ఆగకపోవచ్చు…

ఐపీఎల్ 2022మెగా వేలంగా అమ్ముడుపోని సురేశ్ రైనా.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. 2023 సీజన్ లో తొలిసారిగా సురేశ్ రైనా లేకుండా చెన్నైలో మ్యాచ్ లు ఆడబోతుందని చెన్నై సూపర్ కింగ్స్. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈలో జరగగా 2021,2022 సీజన్లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు, చెన్నైలో జరుగలేదు.. దీంతో రైనా లేకుండా తొలిసారి చెన్నైలో మ్యాచ్ లను సీఎస్కే ఆడబోతుంది.

Also Read : Somu Veerraju: రాష్ట్రంలో ఇసుక.. మట్టి… సిలికా..గనుల దోపిడీ

2021 ఐపీఎల్ తర్వాత టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని ఏడేళ్ల బ్యాన్ అనుభవించిన శ్రీశాంత్, 2021 జనవరిలో ఆ నిషేదం నుంచి బయటపడి దేశవాళీ టోర్నీలో పాల్గొన్నాడు. ఐపీఎల్ 2021.2022 సీజన్ వేలంలో పేరు రిజస్టర్ చేయించుకున్నా.. షార్ట్ లిస్టు జాబితాలో శ్రీశాంత్ కి చోటు దక్కలేదు.. 37 ఏళ్ల వయసులోనూ రీఎంట్రీ ఇస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీశాంత్.. గత ఏడాది మార్చ్ లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ముగ్గురూ ఐపీఎల్ 2023 సీజన్ లో కామెంటేటర్లుగా వ్యవహరించబోతున్నారు.