Surekha Vani: టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె వ్యక్తిగత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్ ఆమె వ్యక్తిగత ఇష్టమని సమర్థిస్తుండగా.. మరికొందరు వయస్సు వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారం, వైరల్ అవుతున్న వీడియో కంటెంట్‌పై సురేఖావాణి తాజాగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని బయటకు తెచ్చి సర్క్యులేట్ చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మీమ్ పేజీలు, మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఛానెళ్లు, నెటిజన్లు ఎవరూ కూడా ఈ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం చేయవద్దని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఈ వ్యవహారాన్ని వాడుకోవద్దని ఆమె హెచ్చరించారు.
ముఖ్యంగా తన ప్రైవేట్ కంటెంట్‌ను ప్రచారం చేసే వారిని గుర్తించి.. ఆధారాలు సేకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దీనిపై న్యాయపోరాటం చేయడానికి వెనుకాడబోనని ఆమె స్పష్టం చేసింది. తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ ఈ వివాదానికి ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

