NTV Telugu Site icon

Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా

Chiranjeevi Surekha

Chiranjeevi Surekha

Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత రాసి శుభాకాంక్షలు చెప్పారు.

నేడు సురేఖ కొణిదెల పుట్టినరోజు. ఈ సందర్బంగా తన సతీమణికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ. నా జీవిత రేఖ, నా శక్తికి మూలస్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుక‌లు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చిరంజీవి ఓ కవిత రాశారు. ఈ కవితకు మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read: Elephant in Tamil Nadu: తమిళనాడులో ఏనుగు భీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి!

చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. దివంగత నటుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ అణా విషయం తెలిసిందే. వీరిది పెద్దల కుదిర్చిన వివాహం. చిరు-సురేఖలకు ముగ్గురు సంతానం (సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ). మరో రెండు రోజుల్లో వీరి వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. ప్రస్తుతం చిరంజీవి యూఎస్‌ ట్రిప్‌లో ఉన్నారు. సురేఖ బర్త్‌డే, వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌ కోసమే మెగాస్టార్ ఈ ట్రిప్‌ వేసినట్లు సమాచారం. ప్రేమికుల రోజున చిరు దంపతులు యూఎస్‌కు వెళ్లారు.