NTV Telugu Site icon

Gujarat : టైర్లు, స్టీరింగ్ లేని క్యాప్సూల్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ

New Project 2024 07 10t121013.676

New Project 2024 07 10t121013.676

Gujarat : గుజరాత్‌లోని సూరత్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టైర్లు, స్టీరింగ్‌ లేని భవిష్యత్‌ కారును కనుగొన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారు 35 కిమీ వేగంతో 80 కిమీ వరకు నడుస్తుంది. క్యాప్సూల్ ఆకారంలో ఉన్న ఈ కారు ఒక వ్యక్తి కూర్చునేంత పెద్దదిగా తయారు చేశారు. జంక్ మెటీరియల్ ను అసెంబ్లింగ్ చేసి తయారు చేసిన ఈ కారు తయారీకి మొత్తం రూ.65 వేలు. ఈ కారును పెద్దమొత్తంలో తయారు చేసినప్పుడు.. దాని ధర మరింత తక్కువగా ఉంటుంది. ఇది భవిష్యత్ కారుగా పిలుస్తున్నారు. ఈ కారును తయారు చేసిన విద్యార్థులు శివమ్ మౌర్య, సంగమ్ మిశ్రా, దల్జీత్ ప్రకారం.. భవిష్యత్తులో ప్రజలకు ఇలాంటి కార్లు అవసరం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారు డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ కారును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా నడపవచ్చు.

Read Also:Auto Driver Fluent English : ఇంగ్లిష్‌లో అదరగొట్టిన ఆటోవాలా.. వీడియో వైరల్..

ఈ కారును తయారు చేయడానికి కొన్ని మెటీరియల్స్ కొనుగోలు చేశారు. అయితే మిగిలిన పదార్థాలు స్క్రాప్ నుండి తీసుకున్నారు. ఈ విద్యార్థుల ప్రకారం, టైర్లు, స్టీరింగ్ లేకుండా ఈ కారును నడపడానికి గేమింగ్ జాయ్‌స్టిక్, మొబైల్ పరికరం ఉపయోగించినట్లు చెప్పారు. నాలుగు అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న ఈ కారులో ఒక్కరు కూర్చోవడమే కాకుండా కొంత సామాను నిల్వ చేసుకునేందుకు కూడా స్థలం ఉంటుంది.

Read Also:Mahindra XUV 700 Price: 2 లక్షలు తగ్గిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర.. నేటి నుంచే అమల్లోకి!

నిర్మాణంలో క్యాప్సూల్‌లా కనిపించే ఈ కారు ఇంటి నుండి మార్కెట్‌కి లేదా కార్యాలయానికి ప్రయాణించడానికి ఉపయోగించవచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద వాహనాలు వెళ్లడానికి రోడ్లపై చాలా తక్కువ స్థలం మిగిలి ఉంటుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ క్యాప్సూల్ కారు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కారు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్. ఈ వాహనం వినియోగంలోకి వచ్చిన తర్వాత కాలుష్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.