NTV Telugu Site icon

NEET UG 2024: నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా

Neet

Neet

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 38 పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..

ఈ పరీక్షలో పేపర్‌ లీకైన మాట వాస్తవమేనని కోర్టు తెలిపింది. కానీ, అది 23 లక్షల మందితో ముడిపడిన అంశం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్‌ ఆప్షన్‌ మాత్రమే అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్ని ఫలితాలను హోల్డ్‌లో పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విచారణలో భాగంగా.. జూలై 10వ తేదీ బుధవారంలోగా డివిజనల్ బెంచ్ ముందు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఎస్జీ తుషార్ మెహతాను కోరారు. మొత్తం ప్రక్రియ ఎలా సాగింది, ఎఫ్‌ఐఆర్‌ తీరు, పేపర్‌ ఎలా లీక్ అయింది, కేంద్రం, ఎన్‌టీఏ ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చూడాలని ధర్మాసనం పేర్కొంది. అందుకే.. దీనిపై జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

చాలా మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చాయని.. స్కోర్ సరళిలోని లోపాలు తదితరాలను పరిశీలించాల్సి ఉందని డివిజన్ బెంచ్ ఎన్టీఏకు తెలిపింది. ప్రశ్నాపత్రాలను ముద్రించడం నుంచి విద్యార్థులకు ఇచ్చే వరకు ఏదైనా లోపం ఉంటే అది వ్యవస్థ వైఫల్యమేనని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షా కేంద్రంలో పంపిణీ వరకు పూర్తి సమాచారాన్ని ఎన్‌టీఏ నుంచి డివిజన్ బెంచ్ కోరింది. కాగా.. ఈ కేసులో గత నెల జూన్ 18న విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ప్రభుత్వ సంస్థ ఎన్టీఏ తన పక్షాన్ని సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, కేసుల తదుపరి విచారణను జూలై 8న జరపాలని డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అయితే.. జూన్ 18 న విచారణ తర్వాత సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో.. విచారణ ఈరోజు చేపట్టారు. కాగా.. ఈ కేసుపై విచారించిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.