NTV Telugu Site icon

Supreme Court: నేడు ఈవీఎం- వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Supreme Court

Supreme Court

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్‌ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఓ వైపు నేడు రెండో విడత పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ఈ కీలక తీర్పు వెల్లడి కానుండటం గమనార్హం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ ఉదయం 10. 30 గంటలకు ఈ తీర్పును వెలువరించనుంది.

Read Also: Lakshmi Stotram: సకల సంపదలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి

కాగా, ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ (ఈసీ)పై సవాలు చేసిన పిటిషనర్లలో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తదితరులు ఉన్నారు. ఇక, బుధవారం నాడు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో ముడిపడిన పలు ప్రశ్నలను ద్విసభ్య ధర్మాసనం సంధించగా.. స్వయంగా ఎన్నికల కమిషన్ నిపుణుల కమిటీ న్యాయస్థానికి వచ్చి వాటికి తగిన సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలన్నీ విన్నాక.. కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదని క్లారిటీ ఇచ్చింది. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడుతున్న తీర్పుపై ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Show comments