Site icon NTV Telugu

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరామ్, అలీఖాన్ నియామకం రద్దు!

Supreme Court

Supreme Court

Supreme Court Cancels Telangana MLC Appointments: తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, ఆమిర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీల నియామకంను రద్దు చేసింది. కోదండరామ్‌, అలీఖాన్‌ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇద్దరి నియామకాలను సవాల్‌ చేస్తూ.. దాసోజు శ్రవణ్‌ కుమార్, సత్యనారాయణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. కోదండరామ్‌, అలీఖాన్‌ ఎమ్మెల్సీల పదవులను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని పేర్కొంది.

Also Read: ICC ODI Rankings: ఆడకున్నా అదరగొట్టిన రోహిత్ శర్మ.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే!

గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సామాజిక సేవకే గవర్నర్ కోటా అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 17కి తదుపరి విచారణను వాయిదా వేసింది. గవర్నర్ కోటా నామినేషన్లలో రాజకీయ జోక్యం ప్రశ్నార్థకమైంది. భవిష్యత్తులో పారదర్శక నామినేషన్లకు దారితీసే తీర్పు అని చెప్పొచ్చు.

 

Exit mobile version