ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. మంగళవారం విచారించిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. తాజాగా న్యాయస్థానం కీలక నోట్ విడుదల చేసింది. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇది కూడా చదవండి: Etela Rajender : తినేంత బువ్వ పెట్టాలని జీవో ఇచ్చింది నేనే
అయితే మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యంతర బెయిల్ ఇస్తే.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించింది. ఫైల్స్‌పై సంతకాలు చేయొద్దని సూచించింది. ఇది అసాధారణ పరిస్థితి అని.. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించింది. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని.. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కాబట్టి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Red Banana : ఎర్ర అరటిపండ్లను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..
అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని.. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని తెలిపింది. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొంది. 9 సమన్లను పట్టించుకోలేదని.. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి తెలిపింది.
అనంతరం కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోమని.. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని అభిప్రాయపడింది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైల్లో పెట్టారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు అన్‌ఫిట్..!