Site icon NTV Telugu

Supreme Court: ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీం సీరియస్‌.. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు

Pinnelli

Pinnelli

Supreme Court: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌.. కాగా, పోలింగ్‌ సమయంలో.. ఓ పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించిన వీడియోను న్యాయమూర్తులకు చూపించారు.. పిన్నెల్ని ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను ప్రదర్శించారు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు.. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది.. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి.. ఈవీఎంను ధ్వంసం చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, పోలింగ్‌ సమయంలో.. పోలింగ్‌ బూత్‌లోనే ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి.. కౌంటింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లకూడదని నిషేధం విధించింది సుప్రీంకోర్టు..

Read Also: Mahbubnagar: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం.. ఉత్కంఠకు రేపటితో తెర..

Exit mobile version