Site icon NTV Telugu

Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని చలించిన సుప్రీంకోర్టు.. తప్పును అంగీకరించిన న్యాయస్థానం..

Supreme Court

Supreme Court

దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని(తీర్పు) తానే మార్చుకుంది. 12 ఏళ్ల బాలుడి హృదయ విదారక కథను విన్న సుప్రీంకోర్టు అతని సంరక్షణ బాధ్యతను తిరిగి అతని తల్లికి అప్పగించింది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ బాలుడు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న తీరుకు కోర్టు కరిగిపోయింది. ఆ బిడ్డ పరిస్థితి చూసి, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు చలించిపోయారు. కోర్టు పది నెలల క్రితం ఇచ్చిన తన ఉత్తర్వును మార్చుకుని, ఆ బిడ్డని తల్లికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ బిడ్డ సంరక్షణను తండ్రికి ఇచ్చి తప్పు చేశామని సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

READ MORE: Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్

అసలు ఏం జరిగింది..?
కేరళకు చెందిన ఓ జంట 2011 లో వివాహం చేసుకుంది. వీరికి 2012 లో బిడ్డ జన్మించాడు. కాలక్రమంలో వీళ్లు వైవాహిక సమస్యలను ఎదుర్కొన్నారు. పరస్పర అంగీకారంతో 2015లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ తన తల్లితోనే ఉంటుందని, తండ్రి నెలకు రెండుసార్లు అతనిని చూడటానికి వెళ్ళవచ్చని వారు అంగీకరించారు. విడాకుల అనంతరం ఆ మహిళ రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. నాలుగు ఏళ్ల తరువాత 2019లో తన భర్తతో కలిసి మలేషియాకు మకాం మార్చాలని నిర్ణయించారు. తన మొదటి బిడ్డను విదేశాలకు తీసుకెళ్లడానికి మాజీ భార్య సంతకం అవసరం. దీంతో ఆమె అతనికి ఫోన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కేరళలోని కుటుంబ కోర్టును ఆశ్రయించి బిడ్డను శాశ్వతంగా తనకు అప్పగించాలని కోరాడు. అయితే, 2022లో కుటుంబ కోర్టు తల్లికి బిడ్డ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆ తండ్రి హైకోర్టుకు వెళ్లాడు. కుటుంబ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు.. బాలుడి పూర్తి బాధ్యతలు తండ్రికి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. మలేషియాకు వెల్లడం మంచిది కాదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. ఆగస్టు 2024లో బాలుడి శాశ్వతంగా తండ్రి వద్దనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

READ MORE: HCA Scam: తీగ లాగితే.. డొంక కదులుతోంది! HCA అక్రమార్కుల భరతం పడుతున్న సీఐడీ..!

అయితే.. బాలుడు ఆందోళన చెందుతున్నాడని.. అతనికి ఆందోళన రుగ్మత వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మనస్తత్వవేత్త నివేదికను ఉటంకిస్తూ.. ఆ బిడ్డ తల్లి సమీక్ష పిటిషన్ దాఖలు చేసింది. తండ్రి తన తల్లిని చూడనివ్వకుండా పిల్లవాడిని బెదిరించాడని, దానివల్ల అతని మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆ మహిళ ఆరోపించింది. ఆ బాలుడితో మాట్లాడిన కోర్టు కరిగిపోయింది. ఆ పిల్లవాడు తన తండ్రిని “అపరిచితుడు”గా చూశాడని, ఒక్క రాత్రి కూడా తన తండ్రితో గడపలేదని కోర్టు పేర్కొంది. దీని కారణంగా, అతని మానసిక, భావోద్వేగ పరిస్థితి క్షీణించింది. ఆ బిడ్డ చదువుకు బదులుగా మానసిక ఆందోళనలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోని సైకియాట్రీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తన తల్లిదగ్గర ఉంటేనే తాను బాగుంటానని ఆ పిల్లవాడు చెప్పిన తీరుకు న్యాయమూర్తులు అంగీకరించారు.

READ MORE: HCA Scam: తీగ లాగితే.. డొంక కదులుతోంది! HCA అక్రమార్కుల భరతం పడుతున్న సీఐడీ..!

ఈ కేసు భావోద్వేగ కేసులలో న్యాయపరమైన చర్యల లోపాలను హైలైట్ చేసింది. కోర్టులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు స్పష్టంగా కనిపించాయి. తల్లిదండ్రుల వాదనలు మాత్రమే విని కోర్టులు నిర్ణయం తీసుకుంటున్నాయి. పిల్లవాడు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటాడో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల మధ్య పిల్లల పోషణకు సంబంధించి వివాదాలను కోర్టు గదిలోనే నిర్ణయించకూడదు. మైనర్లతో మాట్లాడి, వారి తల్లిదండ్రుల ప్రాధాన్యతలు, సౌకర్యాల గురించి తెలుసుకోవాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ. 12 సంవత్సరాలలో కొన్ని సార్లు మాత్రమే బిడ్డను కలిసిన తండ్రికి ఆ బాలుడిని అప్పగించడంతో సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు తప్పు చేశాయని అంగీకరిస్తున్నాం.” అని కోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version