NTV Telugu Site icon

NEET-UG 2024: నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..

Supreme

Supreme

NEET-UG 2024: నీట్‌ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే, ఇప్పటికే నీట్‌ పరీక్ష పేపర్ లీకేజీపై కమిటీ కూడా వేసినట్లు మోడీ సర్కార్ చెప్పుకొచ్చింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయి.. కాగా, అభ్యర్థుల ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ పేర్కొనింది. దీంతో గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.