NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

Babu

Babu

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీం కోర్టులో బాబు కేసుపై విచారణ జరుగనుంది. అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు.

Read Also: OTT Release Movies: ఈవారం ఓటీటీల్లోకి 35 సినిమాలు.. ఆ సినిమాలు ఎక్కడంటే?

ఇక, రేపు ఉదయం10.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నాయి. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17A అనేది అవినీతి నిరోధానికి ఉండాలే గానీ, కాపాడేందుకు కాదు.. ఇదే కదా చట్టం అసలు ఉద్దేశం అని ఆయన వ్యాఖ్యనించారు. 17Aలో చాలా అంశాలున్నాయి.. 17Aకు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా?.. 17A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి? అని న్యాయమూర్తి బేలా కామెంట్స్ చేశారు.

Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ సీఎంలు తమ రాష్ట్రాల్లో కుల గణనపై చర్యలు తీసుకోవాలి..

దీంతో చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే తరపు వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ కక్ష్య సాధింపు.. పబ్లిక్ సర్వెంట్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి అని ఆయన అన్నారు. దీనిపై కేంద్రం SOP కూడా జారీ చేసింది.. ఈ ప్రశ్నపై హైకోర్టులు విభేదించాయి.. కొన్ని హైకోర్టులు 17ఏ నేరం జరిగిన తేదీని అనుసరించాలని అభిప్రాయాన్ని తీసుకున్నారు.. మరి కొన్ని హెచ్‌సీలు 17ఏ తప్పని సరిగా ఎఫ్‌ఐఆర్ తేదీని అనుసరించాలని హరీష్ సాల్వే అభిప్రాయ పడ్డారు. ఫిర్యాదు సెప్టెంబరు 7 2021న దాఖలు చేశారు.. ఆ ఫిర్యాదుతోనే విచారణ మొదలయింది.. 17a కచ్చితంగా చంద్రబాబుకు ఈ కేసులో వర్తిస్తుంది అని హరీస్ సాల్వే పేర్కొన్నారు. ఎంక్వయిరీ వేరు.. విచారణ వేరు.. గుజరాత్ లో సిమెన్స్ ప్రాజెక్ట్ స్టడీ చేశాకే, చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ మొదలు పెట్టారు అంటూ ఆయన వ్యాఖ్యనించారు.