Site icon NTV Telugu

Supreme Court: మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా..

Supreme Court

Supreme Court

ఏపీ అధికారి హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2013లో హైదరాబాదులో మురికి వాడలను కూల్చోద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 80 మంది పోలీసులను పెట్టి ఉత్తర్వులను ఉల్లంఘిస్తారా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మురికివాడలను కూల్చారు నాటి తహసిల్దార్. దీంతో కోర్టు ధిక్కరణ కింద జైలు పాలయ్యారు ఆ అధికారి. విభజన సమయంలో ఈ ఘటన జరిగిందని, అధికారికి పిల్లలు ఉన్నారని వదిలివేయాలని అధికారి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కూలిన ఇళ్లలోని చిన్నారుల పరిస్థితి ఏమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Also Read:Off The Record: కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మాటల వెనక వేరే లెక్కలు ఉన్నాయా..?

ఇల్లు కూల్చినందుకు భారీ ఎత్తున నష్టపరిహారం విధిస్తామని హెచ్చరించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడానికి ఎంత ధైర్యం ఉండాలి.. మా ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అరెస్టు ఉత్తర్వులు ఇస్తాం.. ఆ అధికారి హైకోర్టు కంటే ఎక్కువనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఆయన తాసిల్దార్ స్థానంలో లేరని ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉన్నారని పిటిషన్ తరపున న్యాయవాది వెల్లడించారు. అయితే మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహార శైలి అంగీకరించమని స్పష్టం చేసింది. ఘాటైన వ్యాఖ్యల తర్వాత పిటీషనర్ వాదనను వినేందుకు జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం అంగీకరించింది.

Exit mobile version