NTV Telugu Site icon

Supreme Court Lawyers: తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఈసీకి సుప్రీంకోర్టు న్యాయవాదుల ఫిర్యాదు

Supreme Court Ts

Supreme Court Ts

తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ముఖ్యంగా 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆధాయాలు, ఈ ఐదేళ్లలో విపరీతంగా పెరిగి పోయాయని పేర్కొన్నారు. గత అఫిడవిట్, తాజాగా సమర్పించే అఫిడవిట్లను పోల్చి చూడాలి అని చెప్పామని ఆయన వెల్లడించారు.

Read Also: Andhrapradesh: వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన

ఈ ఐదేళ్లలో ఆదాయం ఏ విధంగా పెరిగింది.. అక్రమ పద్దతిలోనే, సరైన మార్గంలోనా అనే విషయాన్ని ముందే పరిశీలించాలి అని సుప్రీంకోర్టు లాయర్ జగన్ అన్నారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా ఫాలో కావడం లేదు.. పైగా డబ్బులు, మద్యం పంచడం తెలంగాణలో నార్మల్ అయింది.. ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దయచేసి డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే..
ప్రస్తుత సమయంలో ఎన్నికల అధికారుల నిఘా చాలా కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు.. ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ డిమాండ్ చేశారు.

Read Also: WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం జట్లు ఆటగాళ్ల జాబితా విడుదల

ఈసీకి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇవే:
1. అభ్యర్థి ఆదాయ ధృవీకరణపై పూర్తి స్థాయి పరిశీలన అవసరం
2. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని అభ్యర్థులను సరైన విధానంలో నిర్ధారించాలి.
3. ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయకుండా చూడాలి.
4. . అభ్యర్థుల అఫిడవిట్‌ల పరిశీలన నిక్కచ్చిగా ఉండాలి. స్క్రుట్నీ పకడ్బందీగా జరపాలి..
5. గత ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని అంశాలను ఈ సారి ఎన్నికల్లో అనుభవ పాఠాలుగా చూడాలి..
6. ఎన్నికల ఖర్చులను తప్పుగా చూస్తున్న అభ్యర్థులే ఎక్కువ.. అభ్యర్థులపై పర్యవేక్షణ పెంచాలి..
7. తెలంగాణలో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించాలి..
8. చట్టవిరుద్ధమైన చర్యలను ఎదుర్కోవాలి..