Site icon NTV Telugu

Kejriwal: సుప్రీంకోర్టులో నేడు పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లపై విచారణ

Kejriwal

Kejriwal

Defamation case: ఒక పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మీద సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరుగనుంది. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక వీడియోను కేజ్రీవాల్‌ తిరిగి ట్వీట్‌ చేసినందుకు క్రిమినల్‌ కేసు నమోదు అయింది.

Read Also: Medaram Jathara: నేడు మేడారం నుంచి 512 హుండీలు తరలింపు.. 29 నుంచి లెక్కింపు..

అయితే, ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుంది.. అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో ట్రయల్‌ కోర్టు సమన్లను కొట్టివేయడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇక, దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Exit mobile version