Supreme Court: వేసవి సెలవుల తర్వాత జులై 3వ తేదీన సుప్రీంకోర్టు తెరుచుకుంది. ఇదిలా ఉండగా..ఇటీవల సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.గతేడాది సుప్రీంకోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణల లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉచిత వైఫై సేవలను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దీనిపై ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు 1-5 కోర్టులలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని, త్వరలో బార్ రూమ్‌లలో కూడా దీనిని ప్రారంభించనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు.
Also Read: MP Sanjay Raut: త్వరలో మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్… ఎంపీ సంజయ్ రౌత్
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇ-ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత వైఫై సేవలను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు, మీడియా వ్యక్తులు, ఇతరులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. వెల్లడించింది.ఇకపై పుస్తకాలు, కాగితాలు ఉండవని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అయితే వారు పుస్తకాలు, పేపర్లపై అస్సలు ఆధారపడరని దీని అర్థం కాదన్నారు. డిజటలైజేషన్ దిశగా ఇది కీలక ముందడుగుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి సీజేఐ కోర్టుతో పాటు 2, 3, 4, 5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు ఉన్నాయి. దీంతో పాటు కారిడార్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటీన్, ప్రెస్ లాన్ -1, 2 ప్రాంతాల్లో ఈ ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కోర్టు తమ ప్రకటనలో వెల్లడించింది.
ఈ సదుపాయం అన్ని కోర్టు గదులు, పరిసర ప్రాంతాలు, బార్ లైబ్రరీ-I & II, లేడీస్ బార్ రూమ్, బార్ లాంజ్‌లకు దశలవారీగా విస్తరించబడుతుంది.