Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: 10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని స్పీకర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. స్పీకర్ తీర్పు వచ్చినందున కేసును అత్యున్నత న్యాయస్థానం ముగించింది. రేపటిలోగా తీర్పు కాపీలు, 5 రోజుల్లో ఇతర డాక్యూమెంట్లను పిటీషనర్లకు పంపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జి ధర్మాసనం విచారణ జరిపింది.
READ MORE: Hyderabad: కష్టపడి సీఐని చేస్తే.. చావునే బహుమతిగా ఇచ్చింది! భార్య వేధింపులకు భర్త బలి..
Also Read
ఇదిలా ఉండగా.. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న (బుధవారం) కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ బుధవారం తుది తీర్పును వెల్లడించారు.
READ MORE: Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం కీలక ప్రకటన..
తాజావార్తలు
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!