Site icon NTV Telugu

Supreme Court: హేమంత్ సోరెన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

Soren

Soren

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జార్ఖండ్ హైకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే, భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది.

Read Also: Mumbai Bomb Threat: ముంబైకి బాంబు బెదిరింపులు.. ఆరు చోట్ల బాంబులు పెట్టామని..!

ఇక, విచారణ సందర్భంగా హేమంత్ సోరెన్ లాయర్ కపిల్ సిబల్ ను మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ల లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రికి సంబంధించినదని అన్నారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మాట్లాడుతూ.. కోర్టులు అందరికీ సమానం.. హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానమని పేర్కొంది. ఇక, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను భూకేసులో ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Exit mobile version