Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.. అయితే, కారు గుర్తును పోలిఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ లాంటి కామన్ ఎలక్షన్స్ సింబల్స్‌ని కేటాయించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది.. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీనిపై వాదనలు వినిపించింది.. కానీ, బీఆర్ఎస్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. రోడ్డు రోలర్, చపాతి మేకర్‌కు.. కారు గుర్తుకు తేడా తెలియనంత అమాయకులు కాదు దేశ ఓటర్ల అంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం..
Read Also: Leo: బుకింగ్స్ లో భారీ డ్రాప్…
కాగా, తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ లాంటి గుర్తుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని.. వాటి వల్ల కొన్ని స్థానాల్లో ఓటమి పాలయ్యామని భావించిన బీఆర్ఎస్ నేతలు.. ఈ విషయంపై పలు సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ న్యాయపోరాటానికి దిగారు.. అందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.. కానీ, ఆ పార్టీకి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
