Site icon NTV Telugu

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగం కోసం 28 ఏళ్ల పాటు పోరాటం.. ఎట్టకేలకు సాధించాడు

Supreme Court

Supreme Court

Supreme Court: దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంకుర్ గుప్తా అనే వ్యక్తికి న్యాయం జరిగింది. ఎన్నేళ్లైనా అధైర్యపడకుండా తన హక్కుల కోసం అంకుర్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు. ఇన్నేళ్లకు నిర్ణయం అతనికి అనుకూలంగా వచ్చింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అంకుర్ గుప్తాను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఆయనను ఈ పదవికి అనర్హులుగా ప్రకటించడంలో పొరపాటు జరిగిందని కోర్టు పేర్కొంది. వాస్తవానికి అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995 సంవత్సరంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టల్ అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంకుర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అతను తన శిక్షణను కూడా పూర్తి చేశాడు.. కాని తరువాత అతను ఒకేషనల్ స్ట్రీమ్‌లో 12వ తరగతి పూర్తి చేసానని.. అందుకే ఈ ఉద్యోగానికి అంకుర్ అనర్హుడయ్యాడు.

Read Also:Minister KTR: రైతుబంధును ఆపాలని లేఖలు.. కాంగ్రెస్ పై కేటీఆర్ ట్విట్ వైరల్

డిపార్ట్‌మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని అంకుర్ నిర్ణయించుకున్నాడు. కోర్టును ఆశ్రయించాడు. అంకుర్ ఇతర అభ్యర్థులతో కలిసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కి వెళ్లారు. అక్కడ నిర్ణయం వారికి అనుకూలంగా వచ్చింది. అయితే క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 2000 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. 2017లో అలహాబాద్ హైకోర్టు పోస్టల్ శాఖ పిటిషన్‌ను తిరస్కరించి క్యాట్ నిర్ణయాన్ని సమర్థించింది. అలహాబాద్ హైకోర్టులో పోస్టల్ డిపార్ట్‌మెంట్ మరోసారి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే 2021 సంవత్సరంలో కోర్టు దానిని మళ్లీ తిరస్కరించింది. దీనిపై తపాలా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో జస్టిస్ బేల ఎమ్ త్రివేది, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సమయంలో బెంచ్ మొదట అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించలేదు. దీంతో అతను పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడ్డాడు. అభ్యర్థి మెరిట్ జాబితాలో కూడా కనిపించాడు.

Read Also:Rajagopal Reddy: నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ..!

దీనితో పాటు అపాయింట్‌మెంట్ క్లెయిమ్ చేసే హక్కు ఏ అభ్యర్థికీ లేదని, అయితే న్యాయమైన, వివక్షత లేని పరీక్షకు అతనికి హక్కు ఉందని బెంచ్ పేర్కొంది. అభ్యర్థి అంకుర్ వివక్షకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. ఆ శాఖ యథేచ్ఛగా వారికి ఫలితం లేకుండా చేసింది. కోర్టు తీర్పును వెలువరిస్తూ, అంకుర్‌ను పోస్టల్ అసిస్టెంట్ పోస్టులో నెల రోజుల్లోగా నియమించాలని పోస్టల్ శాఖను ఆదేశించింది. దీంతో పాటు ఏదైనా పోస్టు ఖాళీగా లేకుంటే దానికి సంబంధించిన పోస్టును సృష్టించాలని కోర్టు పేర్కొంది.

Exit mobile version