Site icon NTV Telugu

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే బెంచ్ ఖరారు..!

Babu

Babu

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత పెద్ద పెద్ద లాయర్లతో ఈ కేసును వాదిస్తున్నారు. అయినా.. చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందుగా ఏపీ హై కోర్ట్ లో ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. అయినా చంద్రబాబు తరపున లాయర్లు వెనుకంజ వేయకుండా.. ఓటమిని ఒప్పుకోకుండా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కసారి కూడా ఈ కేసును విచారించకుండానే అక్టోబర్ 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Read Also: Nara Lokesh: సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం.. వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు..

కాగా, ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి అక్టోబర్ 3వ తారీఖున విచారించనున్న ఈ కేసులో చంద్రబాబుకు ఉపశమనం లభిస్తుందా లేదా హై కోర్ట్ ఇప్పటికే కొట్టేసిన కేసును సుప్రీం కోర్టు కూడా కొట్టేస్తుందా అనేది వేచి చూడాలి.. అయితే, చంద్రబాబు తరపున వాదించే లాయర్లు వాదనను బట్టి ఆధారపడి ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version