NTV Telugu Site icon

MLA Rajasingh: తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా.. సీఎంకు రాజాసింగ్ రిక్వెస్ట్

Mla Rajasingh

Mla Rajasingh

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ చేసేది పబ్ లోనేనని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని పబ్ లు ఉన్నాయో.. ప్రతి ఒక్క పబ్బుల్లో డ్రగ్స్ సప్లయ్ అవుతుందని తెలిపారు. దీంతో.. యువతీ యువకులు ఎక్కువ శాతం డ్రగ్స్ కి అలవాటుపడుతున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని.. ప్రతి హీరో, హీరోయిన్ డ్రగ్స్ వినియోగించవద్దని మెగాస్టార్ చిరంజీవి లాగా ముందుకు రావాలని రాజాసింగ్ తెలిపారు.

Read Also: Committee Kurrollu: నిహారిక కమిటీ కుర్రోళ్ళు సందడి సందడి చేస్తున్నారు

డ్రగ్స్ ను కంట్రోల్ చేసేందుకు నార్కోటిక్ టీమ్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. పార్టీలను పక్కన పెట్టి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో, ఏదైనా బస్తీలో డ్రగ్స్ అమ్ముతూ కనిపిస్తే వారిపై కేసు పెట్టకండి.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రైమ్ ను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే భయం లేకుంటే ఎవరూ డ్రగ్స్ అమ్మడం మానరన్నారు. డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా నార్కోటిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.. పిల్లల బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది.. పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై నజర్ పెట్టాలని రాజాసింగ్ కోరారు.

Read Also: Deputy CM Pawan Kalyan: వరల్డ్‌ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ..

Show comments