వివిధ జిల్లాల పోలీసు శాఖల్లో పనిచేస్తున్న 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలను కొత్తగూడెం జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది పిల్లలను ఎస్పి బి. రోహిత్ రాజు సన్మానించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలో అహోరాత్రులు కష్టపడుతున్న తల్లిదండ్రుల కన్న కలలను విద్యార్థులు సాకారం చేయాలని రోహిత్ రాజు కోరారు.
Porsche car crash: కారు ప్రమాదం కేసులో మైనర్ తాతని అరెస్ట్ చేసిన పూణె పోలీసులు..
నీతి, నిజాయితీతో పట్టుదలతో జీవితంలో ముందుకు సాగితే అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఎలా చదువుతున్నారన్న దానిపైనే విద్యార్థుల తర్వాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. తాను కూడా ఓ పోలీసు కుటుంబం నుంచి వచ్చానని, కష్టపడి చదివి జీవితంలో రాణించడానికి కారణం తన తల్లిదండ్రుల కృషి వల్లేనని ఎస్పీ తెలిపారు.
Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
ఇక ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో రోహిత్ రాజు ప్రశంసా పత్రాలను అందజేశారు. ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్, డీఎస్పీలు అబ్దుల్ రహెమాన్, చంద్ర భాను, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణారావు(వెల్ఫేర్), నరసింహారావు(హోంగార్డులు), నాగేశ్వరరావు(శిక్షణ), ఎంటీవో సుధాకర్ మొదలగు పోలీసు బాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.