Site icon NTV Telugu

Texas Super Kings: ఎంఎల్‌సీలో అదరగొడుతున్న ఎల్లో ఆర్మీ..

Tsk

Tsk

లీగ్‌ క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, దాని అనుబంధ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. లీగ్‌ ఏదైనా ఎల్లో ఆర్మీ తగ్గేదేలేదంటుంది. ఐపీఎల్‌లో 5సార్లు ఛాంపియన్‌గా నిలిచి లీగ్‌ క్రికెట్‌లో మకుటం లేని మహారాజులా కొనసాగుతున్న సీఎస్‌కే.. ఈ ఏడాదే మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పేరతో ఎంట్రీ ఇచ్చి సెమీఫైనల్‌ వరకు చేరింది. తాజాగా ఎల్లో ఆర్మీ.. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ పేరుతో మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ లోకి కాలు పెట్టింది. వచ్చీ రాగానే సూపర్‌ కింగ్స్‌ ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Read Also: Jammu& Kashmir: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు వలస కార్మికులను కాల్చి చంపిన ఉగ్రవాదులు..

నిన్న జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌కే.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌పై 69 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మినీ సీఎస్‌కేలా కనిపించిన టీఎస్‌కే.. సీఎస్‌కే తరహాలోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టి ఎంఎల్‌సీలో తొలి విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో సూపర్‌ కింగ్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లీగ్‌ క్రికెట్‌లో ఎన్‌ శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలోని సూపర్‌ కింగ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాంచైజీస్‌.. ప్రపంచంలోని మేజర్‌ క్రికెట్‌‌ లీగ్‌లన్నింటిలో తమ ప్రస్తానాన్ని గెలుపుతో ప్రారంభించాయి.

Read Also: SKN: మూడేళ్లు ఎన్నో అవమానాలను భరించాం.. కష్టపడ్డాం.. సాధించాం!

2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌పై సీఎస్కే విజయంతో లీగ్‌ క్రికెట్‌లో తమ ప్రస్తానాన్ని స్టార్ట్ చేసింది. ఇదే ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ తమ ప్రస్తానాన్ని విజయంతోనే (డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌పై విజయం) ఆరంభించింది. తాజాగా ఎంఎల్‌సీని సూపర్‌ కింగ్స్‌ కూడా విజయంతో స్టార్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తాము పాల్గొంటున్న ప్రతి లీగ్‌లో విజయంతోనే ఖాతా తెరిచింది.

Read Also: ISRO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఇస్రో లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

సీఎస్‌కే అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 ఎడిషన్‌ను గెలిచింది. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో ఎంఎల్‌సీలో సూపర్‌ కింగ్స్‌కు ధోని కాకుండా ఫాఫ్‌ డుప్లెసిస్‌ సారథిగా ఉన్నాడు. ఎంఎల్‌సీలో సూపర్‌ కింగ్స్‌తో ధోని లేకపోయినా, ఆ జట్టు విజయంతోనే ఖాతా ఓపెన్ చేసింది. సీఎస్‌కే సభ్యులు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఎంఎల్‌సీలోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. మిచెల్‌ సాంట్నర్‌, డ్వేన్‌ బ్రేవో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి, తమ జట్టు భారీ స్కోర్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Exit mobile version