NTV Telugu Site icon

SRH vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Srh Vs Pbks

Srh Vs Pbks

SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. బ్యాక్-టు-బ్యాక్ ఓటములను చవిచూసిన సన్‌రైజర్స్ జట్టు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్‌ జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. సన్‌రైజర్స్‌ సేన టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు రావాలని ఆహ్వానించింది. గత రెండు ఎడిషన్లలో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు ఈ సారి మెరుగైన ఫలితాల కోసం ఆశించింది. కానీ హైదరాబాద్‌ జట్టు వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రెండు ఘోర పరాజయాలను చవిచూసింది.

ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ సొంత గ్రౌండ్‌లో ఖాతా తెర‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న శిఖ‌ర్ ధావ‌న్ సేన హ్యాట్రిక్ మీద గురి పెట్టింది. మరీ ఈ మ్యాచ్‌లో ఫలితం గురించి వేచి చూడాల్సిందే.

తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఈడెన్ మార్‌క్రమ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (వికె), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (c), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, సామ్ కరణ్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Show comments