బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. శృంగార తారగా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా సినిమా అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తుంది.. అయితే తాజాగా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది.. ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది..
సన్నీ విదేశీ బ్యూటీ.. అక్కడ, ఇక్కడా ఉంటూ వస్తుంది.. ఇండియాలో ఎక్కువగా సినిమాలు చేస్తూ, సొంత బిజినెస్ లను చూసుకుంటుంది.. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్ అయ్యింది.. ఈమధ్య వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది సన్నీ లియోన్. ఇక ఆమెకు సబంధించిన మరో తాజా వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. సినీ తారలు ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు వ్యాపారాలు కూడా చేస్తుంటారు..
సన్నీ కూడా పలు వ్యాపారాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంది.. కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నటి తన రెస్టారెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీలోని నోయిడాలో సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి న్యూ బిజినెస్ ను స్టార్ట్ చేసింది.. హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇచ్చే సన్నీ ఇప్పుడు రుచికరమైన వంటలను వడ్డిస్తానని రెడీ అవుతుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. పలు సినిమాల్లో నటిస్తుంది.. ఐటమ్ సాంగ్స్ లలో కూడా మెరుస్తుంది..
