Site icon NTV Telugu

Sunny Leone : 13ఏళ్ల తర్వాత.. మరోసారి పెళ్లి చేసుకున్న సన్నీలియోన్

New Project 2024 11 05t102058.530

New Project 2024 11 05t102058.530

Sunny Leone : మాజీ శృంగార తార‌ స‌న్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెళ్లి కాని అబ్బాయిల పాలిట కలల రాణి. బాలీవుడ్‌ను ఓ పదేళ్ల పాటు ఏలింది. నార్త్ – సౌత్ రెండు చోట్లా ఐట‌మ్ భామ‌గా ఓ ఊపు ఊపేసింది. ఇటు సౌత్ లోను ఈ భామ ప్రత్యేక గీతాలతో పాటు అతిథి పాత్రలు చేసింది. మంచు మ‌నోజ్ క‌రెంటు తీగ చిత్రంలోనూ న‌టించింది. స‌న్నీ అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుడు అయిన డేనియ‌ల్ వెబ‌ర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సన్నీ లియోన్ 2011లో డేనియల్ వెబర్‌ను వివాహమాడింది. ఆ త‌ర్వాత ఈ జంట అన్యోన్య దాంప‌త్యం, వారి స‌రోగ‌సీ పిల్లలు, ద‌త్త పుత్రిక‌ల‌తో క‌లిసి ఆనంద‌మ‌య జీవితాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 13ఏళ్ల తర్వాత భర్త డేనియల్ వెబర్ ను స‌న్నీలియోన్ మ‌రోసారి పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 31న మాల్దీవులలో తన భర్తలో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. తన కుమార్తె నిషా సన్నీ.. కొడుకులు నోహ్, ఆషర్ తమ తండ్రితో కలిసి ఆమె కోసం వేచి చూస్తుండ‌గా.. స‌న్నీ అక్కడికి వ‌స్తుంది. డేనియల్ ఒక‌ కొత్త పెళ్లి ఉంగరంతో స‌న్నీకి స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also:Murder Case: కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో మహిళని హత్య చేసిన తండ్రికూతురు

ఈ జంట సోషల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌క‌పోయినా కొన్ని ఫోటోలు వెబ్ లో లీక‌య్యాయి. వారి పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ స‌మ‌క్షంలో ఇది మ‌ళ్లీ పెళ్లి అని గుస‌గుస వినిపిస్తోంది. సన్నీ- డేనియల్ సాంప్రదాయ ఆనంద్ కరాజ్ వేడుకలో వివాహం చేసుకున్న 13ఏళ్ల తర్వాత మ‌రోసారి ఈ పెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పెళ్లి వెన‌క చాలా ఆస‌క్తిక‌ర విష‌యం ఉంది. ఇద్దరూ తమ వివాహ ప్రమాణాలను చాలా కాలంగా పునరుద్ధరించాలని అనుకుంటూ వస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టమైన విహారయాత్ర స్థలం కాబట్టి వారు దీన్ని మాల్దీవుల్లో ప్లాన్ చేసారని తెలుస్తోంది. దంపతులు స్వయంగా రాసుకున్న పెళ్లి ప్రమాణాలను చదివి వినిపించారని, ముగ్గురు పిల్లలలో ప్రతి ఒక్కరు కుటుంబం అంటే ఏమిటో చెప్పారని కూడా జాతీయ మీడియా క‌థ‌నం పేర్కొంది.

Read Also:Solidarity Rally In Canada: హిందూ దేవాలయంపై దాడులకు వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ చేపట్టిన హిందువులు

Exit mobile version