Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘ది జెయింట్’ (The Giant) పేరుతో రూపొందుతున్న ఒక భారీ అమెరికన్ వెబ్ సిరీస్‌లో ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైనదని, కొత్త వాతావరణంలో సరికొత్త పాత్రను అన్వేషించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని సన్నీ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!
Also Read
ఇక ఈ సిరీస్ విశేషాలు గురించి మాట్లాడుకుంటే.. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లుగా రానుంది. ప్రతి ఎపిసోడ్ సుమారు అరగంట నిడివి (30 నిమిషాలు) ఉంటుంది, ఇది పూర్తిగా ‘క్యారెక్టర్ డ్రివెన్’ (పాత్రల చుట్టూ తిరిగే కథ) శైలిలో ఉండబోతోంది. హాలీవుడ్ నటుడు కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్, ఆసియా మూలాలున్న నటీనటులు ఇందులో భాగం కానున్నారు. గతంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘కెన్నెడీ’ చిత్రంతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న సన్నీ, ఇప్పుడు ఈ అమెరికన్ సిరీస్‌తో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు ప్రాజెక్ట్ ‘త్రిముఖ’తో పాటు ‘రంగీలా’, ‘షీరో’, ‘హెలెన్’ వంటి ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సిరీస్ ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?