NTV Telugu Site icon

SDGM: బాలీవుడ్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా.. జూన్ 22 నుంచి షూటింగ్!

Sdgm

Sdgm

Sunny Deol, Gopichand Malineni’s New Movie SDGM Starts: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రంను నిర్మిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో ఈ సినిమా (SDGM) లాంఛనంగా ప్రారంభమైంది. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ‘మాస్ ఫీస్ట్ లోడింగ్’ అనేది ఈ చిత్రానికి క్యాప్షన్.

ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. మునుపెన్నడూ చేయని పాత్రలో హీరోని డైరెక్టర్ ప్రెజెంట్ చేయనున్నారట. ఇందులో సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాను హిందీలో తెరకెక్కించినా.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.

Also Read: Abhishek Bachchan: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొన్న అభిషేక్ బచ్చన్.. ధర ఎంతో తెలుసా?

గోపీచంద్ మలినేని చివరగా తీసిన క్రాక్, వీరసింహా రెడ్డి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లు అందుకోవడంతో SDGMపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సన్నీ డియోల్ ‘గదర్ 2’తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. మాస్ మహారాజ్ రవితేజతో చేయాల్సిన సినిమానే.. సన్నీతో గోపీచంద్ తీస్తున్నారట. బడ్జెట్ ఎక్కువ కావడంతోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు నెట్టింట వార్తలు వచ్చాయి.

 

Show comments